logo

హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్స్‌ టెక్నాలజీలో ‘హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు

Published : 16 Jun 2024 05:07 IST

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్స్‌ టెక్నాలజీలో ‘హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ఉమ్మడి జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని, ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయని, నేరుగా రెండో ఏడాది బీటెక్‌లో ప్రవేశించవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైఫండ్‌ పొందేందుకు అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు www.lihtvgr.com ను సందర్శించ వచ్చన్నారు. ఈ నెల 20వ తేదీ స్పాట్‌ అడ్మిషన్ల కోసం ఇన్‌స్టిట్యూట్‌లో సంప్రదించాలని కోరారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని