logo

1,500 గ్రాముల గంజాయి స్వాధీనం

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.రమేశ్‌ ఆయా వివరాలు వెల్లడించారు.

Published : 16 Jun 2024 06:15 IST

ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు తెలియజేస్తున్న డీఎస్పీ రమేశ్‌

తెనాలి టౌన్‌: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.రమేశ్‌ ఆయా వివరాలు వెల్లడించారు. స్థానిక బస్టాండ్‌ రోడ్డులో టూ టౌన్‌ సీఐ సుధాకర్, సిబ్బంది దాడి చేసి శనివారం ఇద్దర్ని పట్టుకుని వారి వద్ద నుంచి 1,500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పశ్చిమబెంగాల్‌ నుంచి అయిదేళ్ల కిందట తెనాలి వచ్చి మగ్గం డిజైన్ల పనిచేస్తున్న నస్కర్‌ మొదటి, తెనాలి ఐతానగర్‌కు చెందిన నాని రెండో నిందితుడు. షఫి అనే వ్యక్తి వద్ద నుంచి నస్కర్‌ గంజాయి కొని చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇతరులకు విక్రయిస్తుంటాడు. ఇప్పటికే షఫిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. మార్చి నుంచి తెనాలి సబ్‌ డివిజన్‌ పరిధిలో 8 గంజాయి కేసులు నమోదు చేసి 40 మందిని అరెస్టు చేశామని, గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా నేరాలేనని వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ ఎం.రమేశ్‌ హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సీఐలు సుధాకర్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు కరిముల్లా, కోటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని