logo

ఉద్యోగాల పేరుతో మోసాలు.. తస్మాత్‌ జాగ్రత్త

తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు.

Updated : 17 Jun 2024 05:08 IST

బాపట్ల, న్యూస్‌టుడే: తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ ఇటీవల కొత్త తరహా సైబర్‌ నేరాలు వెలుగు చూస్తున్నాయన్నారు. తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ నగదు సంపాదించాలనే వారి ఆశను సైబర్‌ నేరగాళ్లు అస్త్రంగా మలుచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు పార్ట్‌టైం ఉద్యోగాల పేరిట వల విసిరి వాట్సాప్‌లో లింకులు పంపుతున్నారని పేర్కొన్నారు. లింకుపై విద్యార్థులు, యువత, మహిళలు క్లిక్‌ చేయగానే టెలిగ్రామ్‌ గ్రూప్‌లో జాయిన్‌ అవుతారని, తేలిక పాటి టాస్క్‌లు ఇచ్చి బుట్టలో వేసుకుని రూ.వేలలు, రూ.లక్షల్లో నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఆన్‌లైన్లో కంపెనీ చట్టభద్రతను ధ్రువీకరించి ఇతర ఉద్యోగుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించి నమ్మకం కలిగిన తర్వాతే ముందుకు వెళ్లాలన్నారు. ఉద్యోగాల పేరుతో ఎవరికీ నగదు ఇవ్వరాదన్నారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయరాదని, ఎవరికీ వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హెల్ప్‌లైన్‌ నంబరు 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

ఈద్గాల వద్ద బందోబస్తు: ముస్లింలు బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేయకుండా పోలీసు నిఘా ఉంచామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని