logo

21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు

రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు.

Published : 17 Jun 2024 04:52 IST

మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ

చినకాకాని(మంగళగిరి), న్యూస్‌టుడే:  రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఓ హోటల్‌లో రాజధాని అమరావతి జేఏసీ ప్రతినిధులు, రైతులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేసిందన్నారు. వీలైనంత త్వరగా వాటిని సిద్ధం చేస్తామని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే అమరావతి రాజధాని నిర్మాణానికి 58 రోజుల్లో 34 వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు రాజధాని పనులను పూర్తిగా విస్మరించిందని, వీటన్నింటికీ మళ్లీ టెండర్లు పిలవాలా..? లేదా గతంలో ఉన్నవాటినే కొనసాగించాలా..? తదితర అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో రాజధానిని పూర్తి చేస్తామని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలోని రోడ్లను తవ్వేసి కంకర అక్రమంగా తరలించేయడంతోపాటు నిర్మాణ సామగ్రి, భవనాల్లోని విద్యుత్తు ఉపకరణాలను అపహరించుకుపోయారని, వాటన్నింటిపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, అమరావతి జేఏసీ ప్రతినిధులు పువ్వాడ సుధాకర్, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని