logo

ప్రజలకు యువనేత భరోసా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్‌’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు.

Updated : 17 Jun 2024 04:58 IST

లోకేశ్‌  ‘ప్రజా దర్బార్‌’కు విశేష స్పందన
తాడేపల్లి, న్యూస్‌టుడే

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్‌’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కుశల ప్రశ్నలతో వారి సమస్యలు విన్నారు. తాను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఉదయం 6 గంటల నుండి నియోజకవర్గంలోని మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, యువతీ యువకులు, పార్టీ కార్యకర్తలు వందల సంఖ్యలో తరలివచ్చారు. మంగళగిరి నుంచి ఘన విజయం సాధించిన ఆయన్ను అభినందించేందుకు వచ్చినవారు కొందరైతే..తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చిన వారు మరొకొందరు. ఆయా అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

తొమ్మిదో తరగతికి అనుమతివ్వండి..

నులకపేటలోని ఎంపీయూపీ ఉర్దూ పాఠశాలలో తొమ్మిదో తరగతి ప్రవేశపెట్టాలని తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు జిలానీ ప్రధానోపాధ్యాయుడు ముస్తాఫాతో కలసి వినతిపత్రం అందజేశారు.  

సామాజిక భవనం నిర్మించరూ..

మంగళగిరిలో దేవాంగ సామాజిక వర్గానికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని ఆ సంఘం ప్రతినిధులు విన్నవించారు. చేనేత ఉపవృత్తికి సంబంధించి చిన్నసైజులో ఉన్న రాట్నాన్ని ఆయనకు బహూకరించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బళ్లా వంకటరమణ, అల్లక తాతారావు, నమశ్శివాయ, నాగశ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. 

ప్రభుత్వం మద్యం దుకాణాలలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 3600 మద్యం దుకాణాల్లో 12 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని, వారిని ఆదుకోవాలని కోరారు.

పాత బకాయిలు ఇప్పించండి.. 

చౌకధరల దుకాణ డీలర్లకు గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పాత బకాయిలను ఇప్పించాలని మంగళగిరి మండల చౌకడిపో డీలర్లు విన్నవించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ డీలర్స్‌ కార్యదర్శి బ్రహ్మానందరావు లోకేశ్‌ను సత్కరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని