logo

నేనున్నాను.. ఆదుకుంటాను

మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.. ఆదుకుంటాను’ అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు.

Published : 18 Jun 2024 05:07 IST

 ‘ప్రజా దర్బార్‌’లో నారా లోకేశ్‌ భరోసా

 లోకేశ్‌కు తన గోడు వినిపిస్తున్న మంగళగిరికి చెందిన జొన్నాదుల రాంబాబు, కుటుంబ సభ్యులు 
తాడేపల్లి, న్యూస్‌టుడే: ‘మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.. ఆదుకుంటాను’ అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు.  గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్‌’ మూడో రోజైన సోమవారం కొనసాగింది. ఉదయం 6 గంటలకే వందల సంఖ్యలో ప్రజలు తమ వినతులతో చేరుకోగా.. వారిని లోకేశ్‌ ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వేతనాలు పెంచాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు చచ్చుపడిపోయాయని, తనకు పింఛన్‌ మంజూరు చేయించడంతోపాటు ఉపాధి మార్గం చూపాలని మంగళగిరి కొప్పురావుకాలనీకి చెందిన జొన్నాదుల రాంబాబు వినతి ఇచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 16 ఏళ్లుగా పనిచేస్తున్న 230 మంది ఔట్‌ సోర్సింగ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం ప్రతినిధులు, గత ప్రభుత్వం తమను అన్యాయంగా తొలగించిందని, యథాతథంగా కొనసాగించాలని కేజీబీవీ పీజీటీలు (తెలుగు, ఇంగ్లీషు) అర్జీలు అందజేశారు. 

వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని