logo

విధ్వంసానికి సాక్ష్యం.. భావితరాలకు పాఠం

గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 2019 జూన్‌ 24న ఉండవల్లిలో ప్రజావేదికను కూల్చేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలనకు..  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించారు. ప్రజావేదిక కూల్చి అయిదేళ్లు కావస్తోంది.

Published : 20 Jun 2024 04:17 IST

ఈనాడు, అమరావతి : గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 2019 జూన్‌ 24న ఉండవల్లిలో ప్రజావేదికను కూల్చేశారు. కూల్చివేతలతో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలనకు..  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించారు. ప్రజావేదిక కూల్చి అయిదేళ్లు కావస్తోంది. నేటికీ ఆ శిథిలాలు అలాగే దర్శనమిస్తున్నాయి. శిథిలాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగాయి. జగన్‌మోహన్‌రెడ్డి అరాచక పాలన అందరికీ తెలిసేలా ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అలానే ఉంచాలని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటనలో భాగంగా ఉండవల్లిలో నాడు జగన్‌మోహన్‌రెడ్డి కూల్చిన ప్రజావేదిక శిథిలాల నుంచే... జన చైతన్యానికి నాంది పలుకుతూ.. రాజధాని ఆకాంక్షలకు ఊపిరిలూదుతూ నవ్యాంధ్ర సారథిగా నేడు నవ నిర్మాణ పథంలో అడుగిడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని