logo

లోకేశ్‌ ‘ప్రజాదర్బార్‌’కు వినతుల వెల్లువ

వైకాపా పాలనలో అన్ని రకాలుగా నష్టపోయి సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రజల నుంచి ‘ప్రజా దర్బార్‌’కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 20 Jun 2024 05:04 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో అన్ని రకాలుగా నష్టపోయి సమస్యల వలయంలో చిక్కుకున్న ప్రజల నుంచి ‘ప్రజా దర్బార్‌’కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఉండవల్లిలోని నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ఈ కార్యక్రమానికి బుధవారం మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రజలు, ఉద్యోగులు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. వారందరినీ లోకేశ్‌ ఆప్యాయంగా పలకరిస్తూ..ఓపిగ్గా సమస్యలు తెలుసుకున్న లోకేశ్‌ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యంత్రాంగం ద్వారా సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం చూపుతున్నారు.

దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నరేష్, కుమారి దంపతులు తమ కుమార్తె చిన్నతనం నుంచి నడవలేకపోతోందని,  వైద్యంతో పాటు పాప ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయం చేయాలని  కోరారు. జ్యోతీబాఫులె బీసీ డబ్ల్యూఆర్‌ పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మార్చాలని,  వైకాపా ప్రభుత్వం తొలగించిన 1,800 మంది బీమామిత్రలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీ ఏసీటీపీఎల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులను క్రమబద్ధీకరించాలని చేయాలని ఏపీ ఎన్‌ఎస్‌ కమిటీ లోకేశ్‌ను కోరారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ఫస్ట్‌ఎయిడ్‌లో శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని ఐక్యవేదిక సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతి అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని