logo

నెల రోజుల్లోగా గుండ్లకమ్మ గేట్లు అమర్చాలి: గొట్టిపాటి

గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండు గేట్ల స్థానంలో కొత్త గేట్లను నెల రోజుల్లోగా అమర్చాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఈ నాగమురళీమోహన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

Updated : 21 Jun 2024 06:03 IST

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్‌ఈ నాగమురళీమోహన్‌తో మాట్లాడుతున్న మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఏలూరి, కందుల

బాపట్ల, న్యూస్‌టుడే: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండు గేట్ల స్థానంలో కొత్త గేట్లను నెల రోజుల్లోగా అమర్చాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఈ నాగమురళీమోహన్‌ను విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఛాంబర్‌లో జలవనరుల శాఖ ఎస్‌ఈతో మంత్రి గొట్టిపాటి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సమీక్షా సమావేశం నిర్వహించి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ వర్షాలు కురిసి గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి నీరు వచ్చే లోగానే కొట్టుకుపోయిన గేట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చి నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా ప్రాజెక్టులో నిల్వ చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపైనా చర్చించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని