logo

అక్షర యోధుడు రామోజీరావు

‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం పెదవడ్లపూడిలో ఘనంగా నిర్వహించారు.

Published : 21 Jun 2024 05:49 IST

  నివాళులర్పిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు,   పాతూరి నాగభూషణం, పాతూరి శ్రీనివాసరావు 

పెదవడ్లపూడి(మంగళగిరి), న్యూస్‌టుడే: ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం పెదవడ్లపూడిలో ఘనంగా నిర్వహించారు. నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, భాజపా మీడియా రాష్ట్ర ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, తెదేపా నాయకులు పాతూరి శ్రీనివాసరావు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్షరాయుధంతో అవినీతిని నిలదీసిన యోధుడు రామోజీరావు అని కొనియాడారు. తొలుత స్థానిక భగవాన్‌ శ్రీసత్య శిర్డీసాయిబాబా మందిరం, గోశాలను సందర్శించారు. గోవులకు ఆహారాన్ని అందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని