logo

చంద్రబాబు హయాంలో బీసీల అభ్యున్నతి

ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయసాధన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కోరారు.

Published : 21 Jun 2024 05:51 IST

మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సత్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 

మంగళగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయసాధన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కోరారు. సచివాలయ ప్రాంగణంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి గురువారం సత్కరించారు. బీసీలకు తెదేపా ప్రత్యేక గుర్తింపు ఇచ్చి మంత్రి పదవులు కేటాయించడం బీసీల అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు. అణగారిన వర్గాలకు చెందిన బీసీ నేతపై విశ్వాసంతో కీలక మంత్రి పదవిని అప్పగించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘం నాయకులు కుమ్మర క్రాంతికుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తన్నీరు ఆంజనేయులు, శివరామ్‌బాబాజీ, పారెపల్లి మహేష్‌ తదితరులు మంత్రిని సత్కరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని