logo

‘దివ్య’ సంకల్పం.. చెదరని అభిమానం

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ తెదేపా కార్యకర్త సైకిల్‌యాత్ర నిర్వహించారు. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన రాఘవేంద్రరావు తెదేపా, జనసేన, భాజపా జెండాలతో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు.

Published : 21 Jun 2024 05:52 IST

ఒంటికాలితో కంకిపాడు నుంచి చంద్రబాబు నివాసం వరకు సైకిల్‌పై వచ్చిన కార్యకర్త  

తాడేపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ తెదేపా కార్యకర్త సైకిల్‌యాత్ర నిర్వహించారు. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన రాఘవేంద్రరావు తెదేపా, జనసేన, భాజపా జెండాలతో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన రాఘవేంద్రరావు రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వైకాపా ప్రభుత్వంలో చంద్రబాబును క్షోభకు గురి చేశారు. అప్పటి నుంచే వైకాపా పతనం ప్రారంభమైంది. కాలు కోల్పోతే కనీసం వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా సాయం చేయలేదు. తొలి నుంచి చంద్రబాబు అభిమానిగా ఉన్నాను. ఎలాగైనా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలపాలని మూడురోజుల క్రితం సైకిల్‌పై బయలుదేరాను’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని