logo

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించండి

నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్‌ చేశారు.

Published : 21 Jun 2024 05:54 IST

మోకాళ్లపై కుర్చొని నిరసన తెలుపుతున్న ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్‌ నాయకులు 

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) జిల్లా కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం కొత్తపేట భగత్‌సింగ్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నాసర్‌జీ మాట్లాడుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసిన నీట్‌ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం, అందులో ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలోని వారికి రావడం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు.పేపర్‌ లీక్‌ చేసిన బిహార్‌కు చెందిన ముఠా ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి దొరికినా వారిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, వలి మాట్లాడుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కేంద్ర విద్యా శాఖా మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, లేని పక్షంలో వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు యశ్వంత్, గణేష్, అజయ్, దుర్గాసాయి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని