logo

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు మీదుగా నడపాలి

విజయవాడ-చెన్నై-విజయవాడ మధ్య తెనాలి మీదుగా వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను న్యూగుంటూరు స్టేషన్‌ మీదుగా నడపాలని పలువురు కమిటీ సభ్యులు సూచించారు.

Published : 21 Jun 2024 06:08 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: విజయవాడ-చెన్నై-విజయవాడ మధ్య తెనాలి మీదుగా వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను న్యూగుంటూరు స్టేషన్‌ మీదుగా నడపాలని పలువురు కమిటీ సభ్యులు సూచించారు. గుంటూరులోని రైల్‌ వికాస్‌ భవన్‌లో గురువారం మండల రైల్వే సలహా సంప్రదింపుల కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన పలువురు సభ్యులు మాట్లాడుతూ మచిలీపట్నం-యశ్వంతపూర్‌-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ-హుబ్లీ మధ్య రద్దు చేసిన ప్యాసింజరు రైలును పునరుద్ధరించాలని కోరారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో రాత్రి సమయంలో ఎస్కలేటర్‌ పని చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదుగా కొత్త రైళ్లు నడపాలని సూచించారు. అన్ని స్టేషన్లలో లిఫ్ట్‌లను, కోచ్‌ ఇండికేషన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్‌యూబీలు, ఆర్‌వోబీలను నిర్మించాలని సూచించారు. అనంతరం మండల రైల్వే అధికారి రామకృష్ణ మాట్లాడుతూ సభ్యులు సూచించిన పలు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడీఆర్‌ఎం సైమన్, డీసీఎం(కోఆర్డినేషన్‌) ప్రదీప్‌కుమార్, సభ్యులు నరసింహం, కిశోర్‌బాబు, సురేష్‌బాబు, వెకంటేశ్వరరావు, శ్రీనివాసరావు, రమేష్, పోలేశ్వరరావు, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని