logo

అత్యాధునిక సీటీ స్కాన్‌.. ప్రారంభానికి సిద్ధం

జీజీహెచ్‌లో రూ.3.82 కోట్లతో అత్యాధునిక సీటీ స్కాన్‌ రోగులకు అందుబాటులోకి రానుంది. అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నిబంధనల ప్రకారం నేషనల్‌ గైడ్‌లైన్స్‌ అనుసరించి సర్వీస్‌ బ్లాక్‌లో ప్రత్యేకంగా సీటీ స్కాన్‌ను అమర్చారు.

Published : 21 Jun 2024 06:11 IST

సీటీ స్కాన్‌ పరికరం 

ఈనాడు, గుంటూరు: జీజీహెచ్‌లో రూ.3.82 కోట్లతో అత్యాధునిక సీటీ స్కాన్‌ రోగులకు అందుబాటులోకి రానుంది. అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నిబంధనల ప్రకారం నేషనల్‌ గైడ్‌లైన్స్‌ అనుసరించి సర్వీస్‌ బ్లాక్‌లో ప్రత్యేకంగా సీటీ స్కాన్‌ను అమర్చారు. ఒక్క రోజులో 150 మందికి పైగా రోగులకు సీటీస్కాన్, సీటీ కాంట్రాస్ట్, యాంజియోగ్రామ్‌. సీఈసీటీ వంటి అధునాతన పరీక్షలు చేయగల 16 స్లైస్‌ సామర్థ్యం దీనికి ఉంది. పరీక్షల కోసం వచ్చే రోగులకు విశాలమైన గది, 2 మూత్రశాలలు రోగులు లోపలికి వెళ్లడానికి ర్యాంపు వంటివి ఇక్కడ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని