logo

సమాజ హితైషి రామోజీరావు

సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని భావించి ప్రజా సమస్యలపై పోరాడిన సమాజ హితైషి  రామోజీరావు అని ‘ఈనాడు’ గుంటూరు యూనిట్‌ మేనేజర్‌ వెంకటేశులు అన్నారు.

Published : 21 Jun 2024 06:13 IST

గుంటూరులోని ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మేనేజర్‌ వెంకటేశులు, ఈనాడు, ఈటీవీ సిబ్బంది 

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని భావించి ప్రజా సమస్యలపై పోరాడిన సమాజ హితైషి  రామోజీరావు అని ‘ఈనాడు’ గుంటూరు యూనిట్‌ మేనేజర్‌ వెంకటేశులు అన్నారు. గురువారం గ్రామీణ గుంటూరు మండలం పొత్తూరులోని ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ జరిగింది. రామోజీరావు చిత్రపటానికి వెంకటేశ్వర్లుతో పాటు ఈనాడు, ఈటీవీ ఉద్యోగులు, విలేకరులు, ప్రియాఫుడ్స్‌ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

  • నీతి, నిజాయితీ, నియమ నిష్టలే విజయ రహస్యాలుగా జీవించిన కారణ జన్ముడు రామోజీరావు అని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. అరండల్‌పేటలోని మార్గదర్శి బ్రాంచ్‌లో రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. రామోజీరావు చిత్రపటానికి లక్ష్మీనారాయణతో పాటు మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్‌ గొరిజవోలు శివరామకృష్ణ, ఈనాడు గుంటూరు యూనిట్‌ పూర్వ మేనేజర్‌ అన్నే శ్రీనివాసరావు, న్యాయవాదులు విట్టల్, వెంకటరావు, ఉద్యోగులు నివాళులు అర్పించారు. 
  • గుంటూరులోని మార్కెట్‌ సెంటర్, తెనాలిలోని మార్గదర్శి శాఖ కార్యాలయాల్లో రామోజీరావుకు ఉద్యోగులు ఘనంగా నివాళులు అర్పించారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అరండల్‌పేట బ్రాంచ్‌ కార్యాలయంలో నివాళులు అర్పిస్తున్న మేనేజర్‌ గొరిజవోలు శివరామకృష్ణ, సిబ్బంది తదితరులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని