logo

అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.లక్ష విరాళం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పునరుద్ధరించనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు గుంటూరుకు చెందిన సుష్మ అనే యువతి రూ.లక్ష విరాళం అందజేశారు.

Published : 22 Jun 2024 06:15 IST

సీఎంకు అందజేసిన గుంటూరు యువతి సుష్మ 

ఈనాడు డిజిటల్, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పునరుద్ధరించనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు గుంటూరుకు చెందిన సుష్మ అనే యువతి రూ.లక్ష విరాళం అందజేశారు. రాష్ట్ర సచివాలయంలో  విరాళం చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు తల్లిదండ్రులు మంజువాణి, రాధాకృష్ణలతో కలిసి శుక్రవారం అందజేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందించినట్టు చంద్రబాబుకు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం అభినందించారు. అమెరికాలోని ఓ ప్రైవేటు కంపెనీలో సుష్మ ఉద్యోగం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు