logo

తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా శ్రమించాలి

తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా ప్రతి విద్యార్థి శ్రమించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు తెలిపారు.

Published : 22 Jun 2024 06:29 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు

విద్యార్థినికి ప్రశంసాపత్రం అందజేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు,
పక్కన కాకినాడ జేఎన్‌టీయూ వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, వాసిరెడ్డి విద్యాసాగర్‌ తదితరులు

నంబూరు (పెదకాకాని), న్యూస్‌టుడే: తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా ప్రతి విద్యార్థి శ్రమించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీవీఐటీ) కళాశాల స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు చేతుల మీదుగా క్లాస్‌ ఆఫ్‌ 2024కి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనపరచిన పది మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలు అందించారు. 1,116 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ కె.మన్మథరావు మాట్లాడుతూ విద్యార్థులు అందర్నీ గౌరవించే అలవాటు చేసుకోవాలని, నిత్యం సాధనచేస్తూ గమ్యం వైపు ముందుకు సాగి స్థిరపడాలని సూచించారు. కాకినాడ జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు మాట్లాడుతూ సాంకేతిక విద్యతో పాటు మానవత్వ విలువలను అలవర్చుకోవాలని కోరారు. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మెరుగైన విజయాలు సాధించేలా ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడిగా ఎదగాలని వీవీఐటీ ఛైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్‌ డీన్‌ డాక్టర్‌ కె.గిరిబాబు, విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని