logo

‘హేమచంద్రారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి’

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై వెంటనే క్రిమినల్‌ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని నవ్యాంధ్ర విద్యార్థి యువజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి డిమాండ్‌ చేశారు.

Published : 24 Jun 2024 04:35 IST

గుంటూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై వెంటనే క్రిమినల్‌ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని నవ్యాంధ్ర విద్యార్థి యువజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి డిమాండ్‌ చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని రైల్వే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ హాల్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉన్నత విద్యామండలిలో జరిగిన అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలి. ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.200 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు.  రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తాం.. ప్రజలకు అక్రమాలను తెలియజేస్తాం’.. అని వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని