logo

పాదయాత్రగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి..

సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి  సీఎంగా  నారా చంద్రబాబునాయుడు  ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 13 Jun 2024 11:25 IST

పెదనందిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి  సీఎంగా  నారా చంద్రబాబునాయుడు  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ  సందర్భంగా నాగులపాడు గ్రామానికి చెందిన వాసు గురువారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి  పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.  540 కిలోమీటర్ల దూరం.. రోజుకి 30 కిలోమీటర్ల  చొప్పున వెళ్తానని,  రాత్రి వేళల్లో  దేవాలయాల్లో బస చేస్తానని చెప్పారు. అనంతరం గ్రామస్థులు ఆయన చేపట్టిన పాదయాత్ర  విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని