logo

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న తెదేపా నాయకులు

మండలంలోని కొర్నెపాడు జగనన్న కాలనీలో వైకాపా నాయకులు అక్రమంగా  ట్రాక్టర్లలో భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు.

Published : 29 May 2024 10:59 IST

వట్టిచెరుకూరు: మండలంలోని కొర్నెపాడు జగనన్న కాలనీలో వైకాపా నాయకులు అక్రమంగా  ట్రాక్టర్లలో భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన తెదేపా నాయకులు, కార్యకర్తలు జగనన్న కాలనీలో జరుగుతున్న అక్రమ  మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. మట్టి తవ్వుతున్న ఒక లైనర్‌ ట్రాక్టర్లను వట్టిచెరుకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత నాలుగు రోజులుగా  మట్టి తవ్వకాలు జరుగుతున్నా వట్టిచెరుకూరు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని తెదేపా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని వారు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు