logo

pinnelli ramakrishna reddy: ‘పిన్నెల్లి’కి ముగుస్తున్న గడువు

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది.

Updated : 06 Jun 2024 08:02 IST

నరసరావుపేట టౌన్, న్యూస్‌టుడే : పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఆయన పలు దాడుల కేసుల్లో నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై న్యాయస్థానం నుంచి తదుపరి నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఆ మేరకు పోలీసులు చర్య తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. బందోబస్తుతో వైకాపా నేతను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చిన పోలీసులు రిజిస్టర్‌లో సంతకం చేయించారు. నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు రెవెన్యూ పరిధిలో ఆయన బస చేసిన ప్రైవేటు విల్లా (గృహం) వద్ద భద్రత మరింతగా పెంచారు. తప్పించుకుని వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పహారా కాస్తున్న పోలీసు సిబ్బందికి సూచించారు. రేపు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు