logo

YSRCP: వైకాపా శ్రేణుల అత్యుత్సాహం.. అన్న ‘టైం’ బాగోలేదు!

ఎన్నికల్లో వైకాపానే అధికారం కైవసం చేసుకుంటుందని.. జగన్‌ సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Updated : 07 Jun 2024 08:19 IST

జగన్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఏర్పాటు చేసిన టైమర్‌

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో వైకాపానే అధికారం కైవసం చేసుకుంటుందని.. జగన్‌ సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం ముందు ‘జగన్‌ అనే నేను’.. అనే పేరుతో కౌంట్‌డౌన్‌ టైంను ఏర్పాటు చేశారు. ఇక కొన్ని రోజులు, కొన్ని గంటల్లోనే జగన్‌ మళ్లీ సీఎం కాబోతున్నారని టైమర్‌ను అమర్చారు. ఫలితాలు తారుమారై కూటమి అఖండ విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో కార్యాలయం ముందున్న టైమర్‌ను తొలగించగా ప్రస్తుతం ఇలా ఖాళీగా దర్శనమిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని