logo

Hyderabad: కోటీశ్వరుడు కావాలని భారీ స్కెచ్‌

ఒక్కసారి దొంగతనం చేయాలి.. కోటీశ్వరుడైపోవాలి.. అనే లక్ష్యంతోనే ఓ దొంగ భారీ దొంగతనానికి పాల్పడాడు. పోలీసులు అతన్ని 24 గంటల్లోనే అరెస్ట్‌ చేసి ఆభరణాలను రికవరీ చేశారు.

Updated : 11 Jul 2024 07:15 IST

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శ్రీనివాస్‌

రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: ఒక్కసారి దొంగతనం చేయాలి.. కోటీశ్వరుడైపోవాలి.. అనే లక్ష్యంతోనే ఓ దొంగ భారీ దొంగతనానికి పాల్పడాడు. పోలీసులు అతన్ని 24 గంటల్లోనే అరెస్ట్‌ చేసి ఆభరణాలను రికవరీ చేశారు. రాజేంద్రనగర్‌ డీసీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. నార్సింగి ఠాణా పరిధిలోని గందంగూడ కృష్ణ రెడ్డికాలనీలో నివసించే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రవిబాబు ఈనెల 3న విజయవాడకు కుటుంబంతో వెళ్లారు. 9న తిరిగి వచ్చిన తరువాత ఇంట్లో చోరీ జరిగిందని, రూ.కోటి విలువచేసే బంగారు అభరణాలు పోయాయని గుర్తించి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చోరీ జరిగిన విధానాన్నిబట్టి స్థానికుడే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆదారంగా గంధంగూడ ఆర్జీకేలో నివాసం ఉండే ప్రవీణ్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు. అతని నుంచి 85 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని