logo

Crime News: నమ్మినవాడే నయవంచకుడై.. షాద్‌నగర్‌ శివారులో స్థిరాస్తి వ్యాపారి దారుణహత్య

నమ్మినవాడే నయవంచకుడయ్యాడు. సహాయకుడిగా ఉంటూనే యజమాని ప్రాణం తీశాడు. షాద్‌నగర్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Updated : 11 Jul 2024 08:31 IST

మృతుడు కృష్ణ

షాద్‌నగర్‌ పట్టణం: నమ్మినవాడే నయవంచకుడయ్యాడు. సహాయకుడిగా ఉంటూనే యజమాని ప్రాణం తీశాడు. షాద్‌నగర్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలివీ.. గండిపేట మండలం హైదర్షాకోట్‌కు చెందిన కమ్మరి కృష్ణ (55) స్థిరాస్తి వ్యాపారి. కమ్మదనంలో ఫాంహౌస్‌ ఉంది. బుధవారం కృష్ణ  మూడో భార్య పావనితో కలిసి అక్కడికి వెళ్లాడు. అదను కోసం చూస్తున్న కృష్ణ వ్యక్తిగత సహాయకుడైన బాబాతోపాటు మరో ఇద్దరు  చాకుతో కృష్ణ గొంతుకోసి పరారయ్యారు.అతని అరుపులు విని పైఅంతస్తులో ఉన్న భార్యవచ్చి కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు.

15 రోజుల క్రితమే: కృష్ణ దగ్గర బాబా వ్యక్తిగత సహాయకుడిగా కొన్నేళ్లుగా పనిచేస్తుండగా ఏడాది క్రితం అతడిని  తొలగించారు. సరిగా పనిచేస్తానంటూ కృష్ణను బతిమాలడంతో 15 రోజుల క్రితమే విధుల్లోకి తీసుకున్నారు. బుధవారం బాబాతోపాటు మరో వ్యక్తిగత సహాయకుడిని కృష్ణ షాద్‌నగర్‌ సమీపంలోని మరో వ్యవసాయ క్షేత్రానికి పంపించినట్లు తెలిసింది. కృష్ణ ఫాంహౌస్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న బాబా ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టాలని అక్కడికి వచ్చాడు. కొంతసేపటికి మరో ఇద్దరు  వచ్చారు. ఇద్దరు కృష్ణ కాళ్లు చేతులు పట్టుకోగా మరొకరు గొంతు కోసి హతమార్చినట్లుసమాచారం. నిందితుల్లో ఇద్దరు కారులో దగ్గరలోని బంకులో పెట్రోల్‌ పోయించుకొన్నట్లు తెలిసింది.

బాబా వెనుక ఎవరు?: కృష్ణకు రూ.వంద కోట్లకుపైగా ఆస్తులున్నాయని, కొన్ని వివాదాస్పదమైనవని, నగరంలో ఇతనిపై భూ ఆక్రమణ కేసులున్నట్లు, మాజీ రౌడీషీటర్‌ అని తెలిసింది. ఇతని మొదటి భార్యకు ఇద్దరు కొడుకులున్నారు. మూడో భార్య సంతానం మొదటి పుట్టినరోజు వేడుకలు 4 నెలల క్రితం నగరంలో చేశారు. హత్యలో కుటుంబసభ్యుల హస్తం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లొంగిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని