logo

Bhatti Vikramarka: ఆదివాసీ మహిళకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శ

ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వేధింపులకు గురైన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మ వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 24 Jun 2024 13:22 IST

హైదరాబాద్‌: ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వేధింపులకు గురైన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మ వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్‌  డైరెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈశ్వరమ్మ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని