logo

Hyderabad: తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం

క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియోషన్‌ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్‌జేలో అందుబాటులోకి రానున్నాయి.

Updated : 15 Jun 2024 07:55 IST

రూ.30 కోట్లతో ఎంఎన్‌జేలో ఆధునిక యంత్రం
త్వరలో అందుబాటులోకి సేవలు

అత్యాధునిక రేడియేషన్‌ యంత్రం

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ చికిత్సలో కీలకమైన రేడియోషన్‌ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్‌జేలో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రూ.30 కోట్లతో ఈ ఆధునిక రేడియేషన్‌ థెరఫీ యంత్రాన్ని ఆసుపత్రిలో సమకూర్చారు. అటమిక్‌ ఎనర్జీ విభాగం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఈ సేవలు అందించనున్నారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు ప్రస్తుతం పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులో ఉన్నాయి. రేడియో థెరఫీలో ఇదో విప్లవాత్మక మార్పు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ యంత్రంపై పిల్లలతోపాటు పెద్దలకు రేడియో థెరఫీ అందించే వీలు ఉంటుంది.

ఇవీ ఉపయోగాలు..

  • ప్రస్తుతం ఆసుపత్రిలో నిత్యం చెరో 300 చొప్పున కీమో, రేడియేషన్‌ థెరఫీలు అందిస్తున్నారు. కొన్నిసార్లు ఒక్కొక్కరికి అందించడం ద్వారా ఎక్కువ సమయం పడుతోంది. ఈ ఆధునిక యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి చికిత్స అందించవచ్చు.
  • క్యాన్సర్‌ కణితిని కూడా కచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. రేడియేషన్‌ థెరఫీలో క్యాన్సర్‌ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతింటుంటాయి.
  • ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతింటే పునరుత్పత్తి కష్టమవుతుంది. ఈ ఆధునిక యంత్రంలో అలాంటి ఇబ్బంది తక్కువ. పూర్తిగా కణితి ఉన్న చోటే రేడియో థెరఫీ అందించనున్నారు. అతిచిన్నగా ఉన్న కణుతులను ఈ థెరఫీతో పూర్తి స్థాయిలో చికిత్స అందించే వీలుంది.
  • ప్రైవేటులో లక్షలు ఖర్చయ్యే వివిధ రకాల క్యాన్సర్లకు ఎంఎన్‌జేలో ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది రోగులు వస్తున్నారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే బీమా సేవలు ఎంఎన్‌జేలో అమలయ్యేలా పరస్పర అవగాహన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని