logo

Hyderabad: 550/100.. వామ్మో.. అంత తాగారా..!

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురు మందుబాబుల ఫలితాలు చూసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు(బీఏసీ) శాతం 550ఎంజీ/100ఎంఎల్‌గా వచ్చింది.

Updated : 24 Jun 2024 08:24 IST

సైబరాబాద్‌లో డ్రంకన్‌డ్రైవ్‌లో నలుగురి బీఏసీ శాతం
శనివారం రాత్రి 385 మందిపై కేసులు

డ్రంకన్‌డ్రైవ్‌ పరీక్షలు చేస్తున్న పోలీసులు 

ఈనాడు, హైదరాబాద్‌: డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురు మందుబాబుల ఫలితాలు చూసి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అవాక్కయ్యారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు(బీఏసీ) శాతం 550ఎంజీ/100ఎంఎల్‌గా వచ్చింది. సాధారణంగా 300 దాటితేనే ఎక్కువగా భావిస్తారు. శనివారం రాత్రి ఈ నలుగురికి ఏకంగా 550/100 రావడం చూసి ఆశ్చర్యపోయారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా డ్రంకన్‌ డ్రైవ్‌లు నిర్వహించి 385మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఐటీ కారిడార్‌పై ఎక్కువ దృష్టిసారించడంతో ఇక్కడే 182 మంది అడ్డంగా దొరికిపోయారు. పబ్బులు, క్లబ్బులు ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోని 17 ప్రధాన మార్గాల్లో వాహనదారులు తప్పించుకోలేని విధంగా డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. కమిషనరేట్‌ మొత్తంలో 292మంది ద్విచక్రవాహనదారులు, 11 ఆటోవాలాలు, 80 కార్లు, రెండు భారీ వాహన డ్రైవర్లు తనిఖీల్లో దొరికారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని