logo

Film industry: ‘ఏపీకి.. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులొచ్చాయి’

‘సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ...

Updated : 24 Jun 2024 09:36 IST

కార్యక్రమంలో విశ్వప్రసాద్, శ్రీవాస్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. ఇటీవల జరిగిన ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పివి.పార్థసారధితో పాటు చిత్రసీమకు చెందిన పలువురు సినీతారలు పాల్గొన్నారు. వారంతా తెలుగు దేశం, జనసేన, భాజపా కలిసి సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని కొనియాడారు. ఈ వేడుకలో నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి చిరంజీవికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని దూరం నుంచి చూస్తే చాలనుకున్నా. అలాంటిది ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి పని చేసే అవకాశం దొరికింది. ‘ పవన్‌ అభిమానులందరూ ఒకరకమైన ఆనందంలో ఉన్నారు. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టి మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఇందులో శ్రీవాస్, చందూ మొండేటి, శ్రీరామ్‌ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, బన్నీ వాసు, కృతి ప్రసాద్, హైపర్‌ ఆది, ఎస్‌కెఎన్, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, టి.ప్రసన్న కుమార్, బాలాదిత్య, సప్తగిరి, మంగ్లీ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని