logo

Hyderabad: నాలెడ్జ్‌ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ టీ హబ్‌ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు.

Updated : 18 Jun 2024 07:18 IST

 స్వాధీనం చేసుకున్న వాహనాలు 

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ టీ హబ్‌ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమవడంతో వాహనాలు వదిలేసి పలాయనం చిత్తగించారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన కథనం ప్రకారం.. నాలెడ్జ్‌ సిటీ టీ హబ్‌ రోడ్లపైకి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటల నుంచి పోకిరీలు రావడం ప్రారంభించారు. పదుల సంఖ్యలో చేరుకుని రేసులు, విన్యాసాలకు తెరతీశారు.  పెద్దగా అరుస్తూ భయాందోళనకు గురిచేశారు. సమాచారం అందుకున్న రెండు గస్తీ వాహనాల కానిస్టేబుళ్లు, బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని అడ్డుకోవాలని చూశారు. దాంతో బైకులతో దూసుకొచ్చి ఢీకొట్టేందుకు యత్నించారు. అప్రమత్తమై బారికేడ్లు ఏర్పాటు చేసి పట్టుకునేందుకు యత్నించగా కొందరు  వాహనాలు అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు పది బైకులు స్వాధీనం చేసుకుని, పలువురు వాహనదారులను అరెస్టు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని