logo

Crime News: ద్విచక్రవాహనాలపై వచ్చి.. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి హత్య

చేవెళ్ల మండలం తంగడ్‌పల్లి గ్రామంలో రులాఖాన్‌ (58) శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు.

Published : 14 Jun 2024 11:00 IST

చేవెళ్ల రూరల్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడ్‌పల్లి గ్రామంలో రులాఖాన్‌ (58) శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ద్విచక్రవాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లో నిద్రిస్తున్న ఆయన్ను హత్య చేశారు. రులాఖాన్‌తో గొడవపడి హత్య చేసి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారు వాహనాలను వదిలి పరారయ్యారు. రులాఖాన్‌ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నగరంలో ఉండగా.. గ్రామంలో ఒక్కడే నివాసంలో ఉంటున్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. మేనల్లుడే హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని