logo

Hyderabad: రూ.13-18 లక్షలకే.. సింగిల్‌ బెడ్‌ రూం ఫ్లాటు!

బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీకి సంబంధించి హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న దరఖాస్తుదారులు ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించింది.

Updated : 11 Oct 2022 09:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీకి సంబంధించి హెచ్‌ఎండీఏ మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న దరఖాస్తుదారులు ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించింది. టోకెన్‌ అడ్వాన్సు చెల్లించిన వారందరి పేర్లుతో మళ్లీ లాటరీ తీయనున్నారు. రెండు చోట్ల దాదాపు 3,700 ఫ్లాట్లు ఉండగా, ఇందులో 40 శాతం మాత్రమే ఇటీవలి లాటరీ ద్వారా విక్రయించారు. లాటరీలో దక్కించుకున్న వారు సైతం పూర్తి డబ్బులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో.. ఇలా మిగిలిన ఫ్లాట్లకు మరోసారి లాటరీ వేయనున్నట్లు సోమవారం హెచ్‌ఎండీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. పోచారం, బండ్లగూడల్లో సింగిల్‌ బెడ్‌ రూం ఫ్లాటు రూ.13-18 లక్షలకు, బండ్లగూడలో 3బీహెచ్‌కే డీలక్స్‌ ఫ్లాటు రూ.50-60 లక్షల్లో పొందే వీలుంది. ఇతర వివరాలకు హెచ్‌ఎండీఏ, రాజీవ్‌ స్వగృహ వెబ్‌సైట్లతోపాటు 79934 55776, 79934 55791 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని