logo

సేవాభావంతో ఉచిత వైద్యం అభినందనీయం

కార్పొరేట్‌ ఆసుపత్రులు సామాజిక సేవలో భాగంగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు.

Published : 26 Mar 2023 02:04 IST

వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న జస్టిస్‌ సూరేపల్లి నంద, సినీ నటుడు సుమన్‌, ఆసుపత్రి ప్రతినిధులు

మీర్‌పేట: కార్పొరేట్‌ ఆసుపత్రులు సామాజిక సేవలో భాగంగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు. కేర్‌ హాస్పిటల్స్‌ బంజారాహిల్స్‌ ఆధ్వర్యంలో మీర్‌పేట కార్పొరేషన్‌ న్యూగాయత్రినగర్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ సహకారంతో బ్యాడ్‌మింటన్‌ కోర్టు ఆవరణలో రెండు రోజుల ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. శనివారం జస్టిస్‌ సూరేపల్లి నంద ముఖ్యఅతిథిగా, సినీ నటుడు సుమన్‌ గౌరవ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సినీ నటుడు సుమన్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైద్యులు ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యం అందించారని అన్నారు. 400 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్యులు నిర్మల్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌, విష్ణురెడ్డి, అఫ్సా ఫాతిమా, స్వర్ణప్రియ, క్రాంతి శిల్ప, రజని ముత్తినేని, అభిషేక్‌ సబ్బాని, టీఎల్‌ఎన్‌.స్వామి, శ్రీనివాస్‌, కె.శ్రీధర్‌, క్రాంతికుమార్‌ సేవలందించారు. అమర్‌నాథ్‌రెడ్డి, కిషోర్‌, ఫల్గుణరావు, చంద భాస్కర్‌, గాయత్రినగర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శులు  ప్రభాకరరావు, కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని