logo

బంగారం విక్రయాల్లో మిల్లీగ్రాముల మాయ

బంగారం విక్రయాల్లో కొందరు వ్యాపారులు మిల్లీగ్రాముల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడవుతోంది.

Published : 30 Mar 2023 02:04 IST

నెలకు సగటున 30 కేసులు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: బంగారం విక్రయాల్లో కొందరు వ్యాపారులు మిల్లీగ్రాముల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడవుతోంది. ఇటీవల తనిఖీల్లో సుమారు 15 కేసులు నమోదయ్యాయి. ఏటా 320 కేసులు నమోదవుతుండగా, రూ.30 లక్షల వరకు దుకాణాదారులకు జరిమానాలు విధిస్తున్నారు.
కచ్చితమైన తూనిక యంత్రాల్లేవ్‌.. : కొన్ని దుకాణాల్లో కచ్చితమైన తూనిక యంత్రాలు లేవు. మరికొందరు ఎలక్టాన్రిక్‌ తూనిక పరికరాలను పునరుద్ధరించుకోవడం లేదు. వ్యాపారులు ఏటా అధికారుల వద్ద తనిఖీలు చేయించి సీల్‌ వేయించుకోవాలి. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ప్రస్తుత ధర రూ.5,400కు పైగా ఉంది. ఈ లెక్కన ఒక మిల్లీగ్రాము ధర రూ.5.4 అవుతుంది. అధికారుల తనిఖీల్లో సుమారు గ్రాముకు పది నుంచి 20 మిల్లీ గ్రాముల తేడాలు ఉన్నట్లు తేలుతోంది. ఈ లెక్కన రూ.120 వరకు నష్టపోయే అవకాశం ఉంది. తనిఖీల సమయంలో కేసులు నమోదవుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రాళ్లతో పొదిగిన బంగారు ఆభరణాలకు బంగారం, రాళ్ల విలువ వేరుగా నిర్ణయించి బిల్లు చేయాలి. కానీ మొత్తం బంగారం ధరే నిర్ణయించి బిల్లు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని