logo

సివిల్స్‌ ర్యాంకర్‌కు సన్మానం

ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్‌ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు.

Updated : 19 Apr 2024 04:36 IST

తరుణ్‌, ఆయన తల్లిదండ్రుల్ని సన్మానించిన ఉపాధ్యాయులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్‌ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన తరుణ్‌ 2017-19 సంవత్సరంలో రాజేంద్రనగర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో ఆయన మంచి ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ నేతృతంలో పలువురు అధ్యాపకులు తరుణ్‌ స్వగ్రామానికి వెళ్లి ఆయనతో పాటు తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన తరుణ్‌ ప్రభుత్వ కళాశాలలో చదివి యూపీఎస్సీలో మొదటి ప్రయత్నంలోనే ఉ్తతమ ర్యాంకు సాధించి సత్తా చాటడం అభినందనీయమన్నారు. నేటి యువతకు తరుణ్‌ ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో మాన్య, కిరణ్‌, చంద్రశేఖర్‌, మురళి తదితరులు పాల్గొన్నారు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని