logo

విమానాశ్రయంలో పార్కింగ్‌ చేసిన డీసీఎం దగ్ధం

పార్కింగ్‌ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 23 Apr 2024 04:00 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: పార్కింగ్‌ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన సురేష్‌ ట్రక్కు డ్రైవర్‌. తన డీసీఎం వ్యాన్‌ను ఈ నెల 20న ఎయిర్‌పోర్ట్‌ కార్గో కాంప్లెక్స్‌ సముదాయంలో పార్కింగ్‌ చేసి స్వగ్రామానికి వెళ్లాడు. ఎండల వేడికి షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో డీసీఎం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. సిబ్బంది గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేసరికి డీసీఎం వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని