logo

వర్సిటీ ఫీజుల్లో రాయితీ ఇప్పిస్తానని మోసం

ఫీజులో రాయితీ ఇప్పిస్తానంటూ రూ.4.39 లక్షలు దండుకున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ (సైబర్‌ క్రైమ్స్‌) డి.కవిత వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు యూఎస్‌ఏ ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌లో చదువుతున్నాడు.

Published : 18 May 2024 02:06 IST

అశోక్‌కుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఫీజులో రాయితీ ఇప్పిస్తానంటూ రూ.4.39 లక్షలు దండుకున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ (సైబర్‌ క్రైమ్స్‌) డి.కవిత వివరాల ప్రకారం.. తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు యూఎస్‌ఏ ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌లో చదువుతున్నాడు. ఏపీ గుంటూరుకు చెందిన కనోళ్ల అశోక్‌ కుమార్‌ (28) పరిచయమయ్యాడు. గతంలో ఇతను యూఎస్‌ఏకు చెందిన తరుణ్‌, దిల్లీకి చెందిన వఖార్‌తో కలిసి ఉన్నత చదువుల కోసం యూఎస్‌ఏకు పంపించే పలు కన్సల్టెన్సీ, ఏజన్సీలలో పనిచేశారు. వీరు విద్యార్థుల డేటాకు యాక్సెస్‌ కలిగి ఉన్నారు. వర్సిటీల్లో సెమిస్టర్‌ ఫీజు రాయితీ ఇప్పిస్తామని యూఎస్‌ఏలోని వర్సిటీల్లో భారతీయ విద్యార్థులను సంప్రదిస్తూ మోసం చేయడం మొదలుపెట్టారు. సెమిస్టర్‌ ఫీజు మొత్తం జమ చేయించుకుంటారు. ఆతర్వాత ఫీజులో 10 శాతం రాయితీతో ఫీజు చెల్లించినట్లుగా నకిలీ రశీదులు పంపిస్తారు. పోలీసులు అశోక్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని