logo

రద్దయిన క్రికెట్‌ మ్యాచ్‌కు టికెట్ల డబ్బు వాపసు

క్రికెట్‌ అభిమానులకు పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ ఊరట కల్పించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో గురువారం రాత్రి హైదరాబాద్‌- గుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ రద్దయింది.

Published : 18 May 2024 03:58 IST

ఉప్పల్‌, న్యూస్‌టుడే: క్రికెట్‌ అభిమానులకు పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ ఊరట కల్పించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో గురువారం రాత్రి హైదరాబాద్‌- గుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ రద్దయింది. ఈ నేపథ్యంలో టికెట్ల డబ్బు రీఫండ్‌ అవుతాయా? లేదా? అన్న ఆందోళన క్రికెట్‌ అభిమానుల్లో మొదలైంది. దీంతో ఐపీఎల్‌ అధికారిక టికెటింగ్‌ పార్ట్‌నర్‌ పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ టికెట్‌ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. త్వరలోనే రిజిస్టర్‌ చేసుకున్న ఈ మెయిల్‌కు పూర్తి సమాచారం అందించనున్నట్టుగా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని