logo

మెట్రో వేళల పొడిగింపు

మెట్రోరైలు వేళల్ని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ప్రతి సోమ, శుక్రవారాలు   పొడిగించింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రోరైలు 11 గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాలు పొడిగించారు.

Updated : 18 May 2024 03:55 IST

చివరి రైలు ప్రతి శుక్రవారం రాత్రి 11.45కు
ప్రతి సోమవారం ఉదయం 5.30కే

నార్సింగి:  మెట్రోరైలు వేళల్ని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ప్రతి సోమ, శుక్రవారాలు   పొడిగించింది. ఇప్పటి వరకు రాత్రిపూట చివరి మెట్రోరైలు 11 గంటల వరకే ఉండేది. దీన్ని ప్రతి శుక్రవారం 45 నిమిషాలు పొడిగించారు. చివరి మెట్రోరైలు టెర్మినల్‌ స్టేషన్లు ఎల్బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచి ప్రతి శుక్రవారం 11.45కు బయలుదేరుతాయి. ఇవి గమ్యస్థానాలకు రాత్రి 12.45 గంటలకు చేరుతాయి. మిగతా రోజుల్లో ఉదయం 6 గంటలకు మెట్రోరైళ్లు బయలుదేరితే ఇకనుంచి ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే ప్రారంభమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని