logo

దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని బెదిరించి.. వయోధికుడికి రూ.20 లక్షల టోకరా

వయోధికుడిని బెదిరించి సైబర్‌ నేరస్థులు నగదు దోచేశారు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.  నగరానికి చెందిన వయోధికుడి(63)కి ట్రాయ్‌ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.

Published : 12 Jun 2024 02:29 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: వయోధికుడిని బెదిరించి సైబర్‌ నేరస్థులు నగదు దోచేశారు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.  నగరానికి చెందిన వయోధికుడి(63)కి ట్రాయ్‌ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీ ఆధార్‌ కార్డు అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ.. కొద్ది గంటల్లోనే మీ సెల్‌ఫోన్‌ సేవలు నిలిచిపోనున్నాయని హెచ్చరించాడు. అంతలోనే ముంబయి సైబర్‌ పోలీసుమంటూ వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. బాధితుడి ఆధార్‌ కార్డుపై కొనసాగుతున్న దర్యాప్తు గురించి వివరించాడు. రాజకీయ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ ద్వారా అండర్‌ వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో మీకు సంబంధాలున్నాయంటూ బెదిరించాడు.  బాధితుడి బ్యాంక్‌ ఖాతా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చి సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మనీలాండరింగ్‌లో మీ హస్తం ఉన్నట్లు విచారణలో వెల్లడైందని బెదిరించాడు. అలా అతడి ద్వారా రూ.20 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయినట్లు గ్రహించి ఆ వయోధికుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని