logo

మైనర్‌ డ్రైవింగ్‌.. రోడ్డుపై కారు విధ్వంసం

మైనర్‌ బాలుడు(14) కారును నిర్లక్ష్యంగా రోడ్డుపై వేగంగా నడపడంతో అదుపుతప్పిన వాహనం రహదారి పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొట్టింది.

Published : 12 Jun 2024 02:30 IST

నార్సింగి, న్యూస్‌టుడే: మైనర్‌ బాలుడు(14) కారును నిర్లక్ష్యంగా రోడ్డుపై వేగంగా నడపడంతో అదుపుతప్పిన వాహనం రహదారి పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద చోటుచేసుకుంది. నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ జి.హరిక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నెక్నాంపూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు సోమవారం సాయంత్రం తల్లిదండ్రులకు తెలియకుండా కారును తీసుకుని రోడ్డుపైకి బయల్దేరాడు. పుప్పాలగూడ సచివాలయ కాలనీలోకి రాగానే ట్రాఫిక్‌ను చూసి ఆందోళన చెందడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఆ వాహనంపై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. అదే క్రమంలో రోడ్డు పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలను, పాదచారులను తాకుతూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతినగా కాలినడకన వెళుతున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు