logo

ముందు చెప్పండి.. ముంపు నుంచి కాపాడుకుంటాం

ఇటీవల నగరంలో కుండపోత వానలు ఎక్కువయ్యాయి. వాతావరణశాఖ నుంచి సమాచారం అందేలోపే.. పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ముంపుతో భారీగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

Published : 12 Jun 2024 02:36 IST

వాతావరణ శాఖకు జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల నగరంలో కుండపోత వానలు ఎక్కువయ్యాయి. వాతావరణశాఖ నుంచి సమాచారం అందేలోపే.. పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ముంపుతో భారీగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. పౌరులతో పాటు, ఐటీ కంపెనీలు, ఇతరత్రా సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి పలు వివరాలు స్పష్టంగా ఇవ్వాలని కోరుతూ దిల్లీలోని వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. 

లేఖలో కోరిన మూడు ప్రధానాంశాలు.. తరచుగా ముంపునకు గురవుతోన్న 125 ట్రాఫిక్‌ సిగ్నళ్లను జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం గుర్తించింది. వాటి వివరాలను వాతావరణ శాఖకు అందిస్తూ.. ఆయా కూడళ్ల వద్ద వర్షం ఎంత సమయం, ఎంత తీవ్రతతో, ఎన్ని నిమిషాల పాటు కురుస్తుందనే అంచనాలను 3 గంటల నుంచి 1 గంట ముందు తెలియజేయాలని ఈవీడీఎం కోరింది. ముందుగా సిబ్బందిని ఆయా కూడళ్లకు తరలించి.. ముంపును వేర్వేరు మార్గాల్లో మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • నగరంలో ఉన్న 30 సర్కిళ్ల వారీగానూ సమాచారాన్ని అందించాలని కోరారు.
  • రాడార్‌ గుర్తించే వర్షం సమాచారాన్ని ఎస్సెమ్మెస్‌ల రూపంలో అధికారులకు అందజేస్తే.. యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేస్తామని కోరారు.

ఎందుకు అడిగారంటే.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని విపత్తు స్పందన దళం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది 24గంటలపాటు వాతావరణశాఖ వెబ్‌సైట్‌ను చూస్తూ అప్రమత్తం అవుతున్నారు. వెబ్‌సైట్‌లో జోన్లు, డివిజన్ల వారీగా వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటోంది. ఆ సమాచారాన్ని తెలుసుకుని, కింది స్థాయి సిబ్బందికి తెలిపేలోపే కుండపోత వాన విధ్వంసం సృష్టిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు