logo

కులాంతర వివాహాలూ జరిపించండి: ఆర్‌.కృష్ణయ్య

‘మ్యారేజ్‌ బ్యూరోల నిర్వాహకులు కులాంతర వివాహాలూ జరిపిస్తే సామాజిక అంతరాలు తొలగిపోతాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

Published : 12 Jun 2024 03:07 IST

శ్రీనివాస్‌గౌడ్‌ను సత్కరిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్, ఆర్‌.కృష్ణయ్య, ఎల్‌.రమణ, గుజ్జ కృష్ణ, దైవజ్ఞశర్మ తదితరులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ‘మ్యారేజ్‌ బ్యూరోల నిర్వాహకులు కులాంతర వివాహాలూ జరిపిస్తే సామాజిక అంతరాలు తొలగిపోతాయని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ మ్యారేజ్‌ బ్యూరో మీడియేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులకు ‘శ్రీమహానంది పురస్కారాల (2023-24) ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండు కుటుంబాలు, మనసులను ఒకటి చేయడంలో వీరి కృషి అభినందనీయమన్నారు. సామాజిక, ఆర్థికఅంతరాలు, వివక్ష తొలగిపోవాలంటే కులాంతర వివాహాలే మార్గమన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షిస్తున్న మ్యారేజ్‌ బ్యూరోవారు ధన్యజీవులన్నారు. ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞశర్మ అధ్యక్షోపన్యాసం చేశారు. నిర్వాహకుడు  శ్రీనివాస్‌గౌడ్‌ స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ, జీబీఎన్‌ వ్యవస్థాపకుడు ప్రభాకర్, తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ, నటుడు సూర్యభారత్‌చంద్ర ఉన్నారు.

బొమ్మ స్వర్ణలత నగేశ్‌ దంపతులకు పురస్కారం అందజేస్తున్న శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాష్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని