logo

ముఖ్యమంత్రి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు పారదర్శకంగా నియామకాలను చేపట్టాలని అభ్యర్థులు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మెకాళ్లపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 12 Jun 2024 03:09 IST

మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న అభ్యర్థులు

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు పారదర్శకంగా నియామకాలను చేపట్టాలని అభ్యర్థులు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మెకాళ్లపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరక్టర్‌ తదితర పోస్టులకు సంబంధించి ఇప్పటికే నియామకాలు చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు ఇతర పోస్టులలోనూ ఎంపికవ్వడంతో ఖాళీలు ఉన్నాయని, మిగిలిపోయే అవకాశం ఉన్న పోస్టులను తర్వాత మెరిట్‌ సాధించిన అభ్యర్థులతో నింపాలని మార్చి 26న కోర్టు తీర్పు ఇచ్చిందని అభ్యర్థులు పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీరు అభ్యర్థులకు నష్టం చేసేలా ఉందన్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్‌ మల్లన్న ముఖ్యమంత్రి నివాసం వద్దకు రాగా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్న మల్లన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం సూచన మేరకు ఆందోళన చేపట్టిన అభ్యర్థులను ముఖ్య కార్యదర్శి సంగీతను కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికే 1:1 అభ్యర్థులను ఎంపిక చేశారని, 1:2 అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని