logo

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌.. వ్యక్తి అరెస్టు

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 12 Jun 2024 03:23 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబరులో గుర్తు తెలియని ఓ వ్యక్తి వీఓఐపీ ఫోన్‌ కాలింగ్‌ అప్లికేషన్‌ ద్వారా  ఎమ్మెల్యేను బెదిరించడం షురూ చేశాడు.  ఎమ్మెల్యే హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్‌ కాల్‌ సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు వెల్లడైంది. పదేళ్లుగా సౌదీలో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్న చాంద్రాయణగుట్టవాసి మహ్మద్‌ వసీం(40) బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు