logo

తీరనున్న వలసదారుల పరేషాన్‌

రాజధానిలో వలసదారుల(మైగ్రేషన్‌) రేషన్‌ దరఖాస్తుల వడపోత ప్రక్రియ మొదలైంది. ఉపాధి కోసం వలస వచ్చినవారంతా కొత్తకార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్లు, తదితరాలపై వీరంతా జీహెచ్‌ఎంసీలో 2020లో దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 12 Jun 2024 06:53 IST

దరఖాస్తుల పరిశీలన ప్రారంభం
ప్రభుత్వ ప్రకటనతో కొత్త రేషన్‌ కార్డులపై అర్హుల్లో ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌ : రాజధానిలో వలసదారుల(మైగ్రేషన్‌) రేషన్‌ దరఖాస్తుల వడపోత ప్రక్రియ మొదలైంది. ఉపాధి కోసం వలస వచ్చినవారంతా కొత్తకార్డుల జారీ, కుటుంబ సభ్యుల పేర్లు, తదితరాలపై వీరంతా జీహెచ్‌ఎంసీలో 2020లో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని తాజాగా పరిశీలించి అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఇంటింటి సర్వే చేయాలంటూ పౌరసరఫరాలశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో మూడు జిల్లాల అధికారులు పరిశీలన చేపట్టారు.

భారీగా అర్హులు..: కొత్త రేషన్‌ కార్డులపై అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ చేయకపోవడంతో అర్హుల  సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు ప్రజాపాలనలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రేషన్‌ కార్డుల మ్యుటేషన్లు, కొత్త కార్డుల జారీపై గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ అంశం పెండింగ్‌లో ఉంది. గ్రేటర్‌లో సుమారు 2లక్షల మంది కొత్త పేర్ల నమోదు, చిరునామాలో మార్పులు, తప్పుడు వివరాల సవరణ తదితరాలపై దరఖాస్తు చేసుకున్నారు. వాటిల్లో 10శాతం తిరస్కరించగా...30శాతం దరఖాస్తుల ప్రక్రియ మాత్రమే పూర్తయ్యింది. 60శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని