logo

అభివృద్ధికి లింకు

దూర ప్రాంతాలను దగ్గర చేస్తూ.. నగరాభివృద్ధిని అన్ని దిక్కులా విస్తరించడమే లక్ష్యంగా చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం విజయవంతంగా సాగుతోంది. ఏడాది కిందటే మొదటి దశ పనులు పూర్తవగా..

Updated : 12 Jun 2024 04:56 IST

అనుసంధాన రోడ్లతో బస్తీలు, కాలనీలకు ప్రయోజనం

అన్నపూర్ణ స్టూడియో వద్ద చివరి దశలో ఉన్న లింకు రోడ్డు

దూర ప్రాంతాలను దగ్గర చేస్తూ.. నగరాభివృద్ధిని అన్ని దిక్కులా విస్తరించడమే లక్ష్యంగా చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం విజయవంతంగా సాగుతోంది. ఏడాది కిందటే మొదటి దశ పనులు పూర్తవగా.. ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. నిధుల సమస్యతో పనుల్లో వేగం నెమ్మదించినప్పటికీ పురోగతి కొనసాగుతోంది. తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.5ను బంజారాహిల్స్‌ రోడ్డు నం.2తో కలిపే కీలకమైన రహదారి నిర్మాణం పూర్తి చేసుకుంది. భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇంజినీర్లు భారీ కొండను తొలగించి ప్రధాన నగరంలో అభివృద్ధి మార్గాన్ని నిర్మించారని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఊపిరి పీల్చుకుంటున్న బస్తీలు : యూసఫ్‌గూడ, శ్రీనగర్‌కాలనీ చుట్టుపక్కలున్న వందకుపైగా కాలనీలకు భారీ ఉపశమనం కల్పిస్తూ యూసఫ్‌గూడ చెక్‌పోస్టు రోడ్డు (జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.5), కేబీఆర్‌ పార్కు రోడ్డు (బంజారాహిల్స్‌ రోడ్డు నం.2)తో అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణమైంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.1, రోడ్డు నం.5లో  రద్దీ తగ్గనుంది. ఇందిరానగర్, జవహర్‌నగర్, కమలాపురికాలనీ, శ్రీనగర్‌కాలనీ ప్రజలు పంజాగుట్ట, క్యాంప్‌ ఆఫీసు, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రోడ్డు, బంజారాహిల్స్‌ రోడ్డు నం.10, 14, 12, 3, 1 రోడ్లను సులువుగా చేరుకోవచ్చు.

మరిన్ని పురోగతిలో..

  • లింకు రోడ్ల అభివృద్ధి మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.323 కోట్లతో 25 రోడ్లను 25.2 కి.మీ పొడవున హెచ్‌ఆర్‌డీసీఎల్‌ అభివృద్ధి చేసింది.
  • రెండో దశలో భాగంగా రూ.185.25 కోట్లతో 11 రోడ్లను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు తుది దశలో ఉన్నాయి.  ఎన్నికలు పూర్తవడంతో ప్రభుత్వం హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు ఆర్థిక తోడ్పాటు అందించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
  • మూసారంబాగ్‌ అలీకేఫ్‌ చౌరస్తా నుంచి నాగోల్‌ మెట్రోస్టేషన్‌ వరకు రోడ్డును 100 అడుగుల మేర అభివృద్ధి చేస్తూ రూ.20 కోట్లతో చేపట్టిన లింకు రోడ్డు పనులు తుది దశలో ఉన్నాయి. ల్యాంకోహిల్స్‌ కూడలి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్‌ సన్‌సిటీ,  అల్కాపురికాలనీ, నెక్నాంపూర్‌ ప్రాం తాల్లో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు