logo

రాజధానిలో కుండపోత

నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వరణుడు విజృంభించాడు. పలుచోట్ల కుండపోత వానతో రోడ్లు జలమయమయ్యాయి.

Updated : 12 Jun 2024 04:59 IST

కి.మీ పొడవునా రోడ్లపై నిలిచిన వాహనాలు

మలక్‌పేట రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద మోకాలు లోతు నిలిచిన వరదలోనే రాకపోకలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వరణుడు విజృంభించాడు. పలుచోట్ల కుండపోత వానతో రోడ్లు జలమయమయ్యాయి. మలక్‌పేట రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద నడుము లోతున నీరు నిలవడంతో  రాకపోకలు రెండు కిలోమీటర్ల పొడవుననా స్తంభించాయి. ఆ రోడ్డు మార్గంలో వాహనదారులు కిలోమీటరు ప్రయాణించేందుకు అరగంట సమయం పట్టింది.  రామంతాపూర్, షేక్‌పేట, ముషీరాబాద్, నారాయణగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, హయత్‌నగర్, ఈసీఐఎల్, మల్కాజిగిరి, జీడిమెట్ల, సుచిత్ర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్‌ బౌద్ధనగర్‌లో 4.68సెం.మీల గరిష్ఠ వర్షపాతం నమోదవగా, రామంతాపూర్, అంబర్‌పేట, కాప్రా సర్దార్‌మహల్, హయత్‌నగర్‌లో 4సెం.మీల పైనే వర్షం కురిసింది.


వర్షాకాల సన్నద్ధతపై మంత్రి పొన్నం సమీక్ష నేడు

ఆర్ట్స్‌ కాలేజీ ఎంఎంటీఎస్‌ రైల్వే వంతెన కింద చేరిన వరదలో పాదచారుల ఇక్కట్లు

నగరంలో వర్షాకాల సన్నద్థతపై అధికార యంత్రాంగంతో కలిసి బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష చేయనున్నట్లు బల్దియా వెల్లడించింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో కలిసి జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ జియాఉద్దీన్‌ ఆధ్వర్యంలో ఇంజినీర్లు వర్షాకాల సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇతర వివరాలతో నివేదిక సిద్ధం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని