logo

తొలిరోజే.. తప్పని నిరీక్షణ!

పాఠశాలల పునః ప్రారంభమైన తొలిరోజే బుధవారం ఉర్దూ మాధ్యమం పాఠశాల తెరుచుకోక పిల్లలు నిరీక్షించి ఇంటిదారి పట్టారు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని ఎన్కతలలో ఉర్దూ విద్య అభ్యసించేందుకు ప్రాథమిక పాఠశాల ఉంది.

Published : 13 Jun 2024 01:44 IST

మోమిన్‌పేట: పాఠశాలల పునః ప్రారంభమైన తొలిరోజే బుధవారం ఉర్దూ మాధ్యమం పాఠశాల తెరుచుకోక పిల్లలు నిరీక్షించి ఇంటిదారి పట్టారు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని ఎన్కతలలో ఉర్దూ విద్య అభ్యసించేందుకు ప్రాథమిక పాఠశాల ఉంది. బుధవారం తిరిగి ప్రారంభం కావడంతో గ్రామానికి చెందిన కొందరు తమ పిల్లలను పాఠశాలకు పంపించారు. సమయం దాటినా తెరుచుకోక పోవడంతో తిరిగి ఇళ్లకు చేరుకున్నారని తల్లిదండ్రులు తెలిపారు.  

విద్యార్థులు లేకనే మూత: ఎంఈఓ

విద్యార్థుల సున్నా నమోదు ఉండడంతో తొలిరోజు ప్రారంభిచలేకపోయినట్లు ఎంఈవో గోపాల్‌ తెలిపారు. గత విద్యా సంవత్సరమే పాఠశాలలో విద్యార్థులు లేక ఇక్కడ విధులు నిర్వర్తించే ఉపాధ్యాయురాలిని టేకులపల్లి ఉర్దూ మాధ]్యమ పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించామని తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వర్తించే రేష్మ ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవులపై ఉన్నారని అక్టోబర్‌ మాసంలో విధుల్లో చేరతారన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని