logo

కళాశాలల గుర్తింపు ప్రక్రియ రెండో విడతపై కసరత్తు

ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపులో కీలకమైన అప్పిలేట్‌ కమిటీ పరిశీలన రెండో ఫేజ్‌కు జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

Published : 13 Jun 2024 01:48 IST

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపులో కీలకమైన అప్పిలేట్‌ కమిటీ పరిశీలన రెండో ఫేజ్‌కు జేఎన్‌టీయూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే మొదటి ఫేజ్‌లో ఏఐసీటీఈ గుర్తింపు లభించిన 94 ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వర్సిటీ అప్పిలేట్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలన పూర్తిచేసిన విషయం తెలిసిందే. ముందుగా ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన అభ్యర్థనల పరిశీలన చేపట్టగా.. ఇంకా 45 కళాశాలలు మిగిలాయి. ఇందులో 32 కళాశాలలకు ఏఐసీటీఈ  గుర్తింపు లభించగా.. వీటి పరిశీలన రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని